60 రోజులకు చేరిన జిందాల్ రైతుల నిరసనలు

VZM: జేఎస్డబ్ల్యూ జిందాల్ సంస్థకు భూములు ఇచ్చి మోసపోయామంటూ జిందాల్ భూ నిర్వాసితులు చేస్తున్న నిరసనలు 60వ రోజుకు చేరుకున్నాయి. ఎమ్మెల్సీ రఘురాజు ఇంటి ఆవరణలో ఈ సమ్మెలో చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని సీపీఎం నాయకుడు చల్లా జగన్ వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల మొర ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరారు.