జిల్లాలో కమర్షియల్ గ్యాస్ కష్టాలు
VKB: జిల్లాలో కమర్షియల్ HP గ్యాస్ కొరత తీవ్రమైంది. సకాలంలో సిలిండర్లు అందక హోటల్ యజమానులు కట్టెలు, బొగ్గు పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల వంట ఆలస్యమవ్వడమే కాకుండా పొగతో ఇబ్బందులు తప్పడం లేదు. గ్యాస్ లేక వ్యాపారాలు నడవక హోటళ్లు మూతపడే స్థితికి చేరుకున్నాయి. అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని వ్యాపారులు కోరుతున్నారు.