VIDEO: మక్తల్‌లో సీసీ రోడ్ల పనులు ప్రారంభం
NRPT: మక్తల్ మున్సిపాలిటీ 7వ వార్డు గుర్లపల్లి రోడ్డులో మంత్రి వాకిటి శ్రీహరి గత వర్షకాలం ఇచ్చిన హామీ మేరకు మంగళవారం మున్సిపాలిటీ ఛైర్మన్ మానస హనుమంతు సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ప్రారంభించారు. స్థానికులు వార్డు అభివృద్ధికి సహకరిస్తున్న మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పనులు పూర్తి కావడం ద్వారా ప్రాంత ప్రజలకు సౌకర్యం పెరుగుతుందని ఆశిస్తున్నారు.