మ్యాన్ హోల్ తెరిస్తే.. కేసులు పెడతాం: జలమండలి

HYD: ప్రస్తుత వర్షాకాలం వేళ పలుచోట్ల అనుమతి లేకుండా మ్యాన్ హోల్స్ తెరవటంపై జలమండలి సీరియస్ అయింది. మరోసారి బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాన్‌హోల్ మూతలను తెరవవద్దన్నారు. మ్యాన్‌హోళ్లు తెరవడం జలమండలి యాక్ట్‌లోని సెక్షన్ 74 ప్రకారం నేరమని, ఎవరైనా మ్యాన్‌హోల్ మూతలు తెరిస్తే క్రిమినల్ కేసులు పెడతామంది.