ప్రమాదవశాత్తూ గాయపడిన కార్మికులు
ASR: చింతపల్లి మండలం తాజంగిలో జరుగుతున్న స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణ పనుల్లో శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు గాయపడ్డారు. యాంపీ థియేటర్ స్లాబ్ వేసేందుకు వీరబాబు, బాబూరావు పరంజి నిర్మిస్తూ ప్రమాదవశాత్తూ జారిపడ్డారు. గాయపడిన వీరిని తోటి కార్మికులు ముందుగా తాజంగి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ నుంచి నర్సీపట్నం తీసుకెళ్లారు.