నూతన తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన భూపతి

SRCL: చందుర్తి మండల నూతన తహసీల్దారుగా లగిశెట్టి భూపతి మంగళవారం నియామకమయ్యారు. చందుర్తి తహాసీల్దార్‌గా పని చేస్తున్న శ్రీనివాస్ బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో భూపతి నియమించారు. దీంతో భూపతి బాధ్యతలు చేపట్టారు. భూపతి హయాంలో మండలంలో భూముల సమస్యలు పరిష్కారం అవుతాయని మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.