VIDEO: సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
GNTR: ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం మంగళగిరిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించే "దివ్యాంగ శక్తి" కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం దివ్యాంగులతో కలిసి మంగళగిరి నుంచి ఉండవల్లి వరకు సీఎం ప్రయాణించే అవకాశం ఉండటంతో, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.