ద్విచక్ర వాహనం అదుపు తప్పి వ్యక్తి మృతి
KRNL: హొళగుంద మండలంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. హొళగుంద గ్రామానికి చెందిన సిద్ధప్ప ద్విచక్రవాహనంపై వెళ్తుండగా అదుపుతప్పి డ్రైనేజీ కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సిద్ధప్ప తలకు బలమైన గాయం కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.