ఎమ్మెల్యే సహకారంతో హైమాస్ట్ లైట్లు ప్రారంభం
NGKL: వెల్దండ మండలం పోచమ్మ తండాలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ఇవాళ గ్రామ నాయకుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. తండాకు లైట్లు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు తండా వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుబ్బ తండా శ్రీను, బాలునాయక్, విమల్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.