VIDEO: పులివెందులలో త్రుటిలో తప్పిన ప్రమాదం
KDP: పులివెందుల పట్టణంలోని ముద్దునూరు రోడ్డులో గురువారం ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. ఆర్టీసీ బస్సు నుండి ప్రయాణికుడు దిగకముందే డ్రైవర్ బస్సును కదిలించడంతో అతను కింద పడ్డాడు. ప్రమాదవశాత్తు అతను టైర్ కింద పడకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది అని స్థానికులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యానికి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.