VIDEO: కాలువపల్లి వద్ద గ్రామస్థులు నేషనల్ హైవేపై ధర్నా
ATP: బెలుగుప్ప మండలం కాలువపల్లి వద్ద గ్రామస్తులు నేషనల్ హైవేను బంద్ చేసి ధర్నా నిర్వహించారు. ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్రెలు మృతి చెందడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనాలు అదుపు లేకుండా వేగంగా వెళ్లడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. ఘటనపై వెంటనే చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని వారు కోరారు.