పర్యావరణహిత సంచుల పంపిణీ చేసిన టీడీపీ నేతలు
W.G: తాడేపల్లిగూడెం పట్టణంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర- స్వచ్ఛాదివస్ కార్యక్రమంలో భాగంగా ప్రకృతికి హానికలిగించని నార సంచులను మహిళలకు టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ వలవల బాబ్జీ పంపిణీ చేశారు. సుమారు రెండు వందల మంది మహిళలకు వీటిని అందచేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఆకాశపు స్వామి, పద్మనాభుని మురళి, ముత్యాల శ్రీనివాస్, ఏరుబండి సతీష్, సాయి తదితరులు పాల్గొన్నారు.