VIDEO: జగన్ మరోసారి సీఎం కావాలని శబరిమలకు పాదయాత్ర
GNTR: పొన్నూరు మండలం కట్టెంపూడికి చెందిన మణికంఠస్వామి వైసీపీ వీరాభిమానిగా శబరిమల పాదయాత్రలో పాల్గొన్నారు. అయ్యప్ప మాల ధరించి, రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం రావాలని, జగన్ మరోసారి సీఎం కావాలని కోరుతూ పార్టీ జెండాను వీపున కట్టుకుని పాదయాత్ర చేశారు. అనంతరం అయ్యప్పస్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.