బంగారం వ్యాపారులు నిబంధనలు పాటించాలి: డీఎస్పీ
VZM: చీపురుపల్లిలో బంగారం వ్యాపారులు నిబంధనలు పాటించాలని, అనుమానాస్పద వ్యక్తుల నుంచి నగలు కొనుగోలు చేయొద్దని డీఎస్పీ ఎస్ రాఘవులు సూచించారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో పట్టణాల్లో ఉన్న బంగారం వ్యాపారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దుకాణం లోపల, బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సాధ్యమైనంత వరకు డిజిటల్ లావాదేవీలు చేయాలని కోరారు.