ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే
SRPT: పదేండ్లలో దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది తెలంగాణ తొలి సీఎం కేసీఆరేనని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం తాళ్లకాంపాడ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. పదేండ్లలో రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉండేదని, ఇప్పటి రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ఎన్నో అరాచకాలు చూస్తున్నామని పేర్కొన్నారు.