జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు
SRCL: జిల్లా ప్రధాన న్యాయస్థానానికి బాంబు బెదిరింపు వచ్చింది. కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టి న్యాయస్థానాన్ని పేలుస్తామని, కోర్టు మెయిల్ ఐడీకి ఆదివారం గుర్తు తెలియని అకౌంట్ నుంచి మెయిల్ పంపారు. ఇవాళ కోర్టు కార్యాలయానికి వచ్చిన సిబ్బంది బాంబు బెదిరింపు మెయిల్ గమనించి అప్రమత్తమయ్యారు. పోలీసులు డాగ్, బాంబు స్క్వాడ్‌తో ప్రాంగణానికి చేరుకుని, కోర్టు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.