రాయచోటిలో శక్తి యాప్ గురించి మహిళలకు అవగాహన

రాయచోటిలో శక్తి యాప్ గురించి  మహిళలకు అవగాహన

అన్నమయ్య: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్‌స్పెక్టర్ శంకర మల్లయ్య శక్తి టీం గురించి రాయచోటిలోని ప్రైవేట్ కళాశాలలో బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇన్స్‌స్పెక్టర్ మాట్లాడుతూ.. మహిళలు శక్తి టీం యాప్‌ ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. దీని వల్ల ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉండవచ్చన్నారు.