ఆకేరు వాగులో పశువుల కాపరి గల్లంతు

ఆకేరు వాగులో పశువుల కాపరి గల్లంతు

WGL: గేదెలను బయటకు తోలేందుకు వాగులోకి దిగిన పశువుల కాపరి గల్లంతైన ఘటన మంగళవారం పర్వతగిరి మండలంలోని నారాయణపురం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఉప్పలయ్య పశులను మేతకు తీసుకెళ్లాడు. అయితే, ఆకేరు వాగు ఉప్పొంగడంతో వాగులోకి దిగిన పశువులను బయటకు తోలేందుకు లోపలికి వెళ్లాడు. ఈ క్రమంలో వరద ఉద్ధృతికి గల్లంతయ్యాడు.