రూ. 25 వేల నష్టపరిహారం ఇవ్వాలి: MCPI(U)
WGL: నర్సంపేట మండలం మాదన్నపేట గ్రామంలో అకాల వర్షాల కారణంగా పత్తి, మొక్కజొన్న పంటలు పూర్తిగా పాడవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో MCPI(U) ( మార్కిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా) బృందం పంట పొలాలను సందర్శించింది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేత రాధాసుధ మాట్లాడుతూ.. వర్షానికి దెబ్బతిన్న పంటకు ప్రభుత్వం ఎకరానికి రూ. 25 వేల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.