ఫ్రీ బస్సులు తక్కువ.. ఛార్జీ బస్సులే ఎక్కువ

HYD: ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద రాఖీ పండుగ నేపథ్యంలో దాదాపు 150 బస్సులు అధికంగా నడిపిస్తున్నామని ఆర్టీసీ అధికారులు తెలియజేశారు. అయితే ఎటు చూసినా మొత్తం డీలక్స్, లగ్జరీ, సూపర్ లగ్జరీ, రాజధాని లాంటి బస్సులు కనిపిస్తున్నాయని, పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు అసలు కనిపించడం లేదని ప్రయాణికులు చెబుతున్నారు. గత్యంతరం లేక డబ్బులు పెట్టుకుని ప్రయాణిస్తున్నట్లు మహిళా ప్రయాణికులు వాపోతున్నారు.