కలుషితమయంగా మారుతున్న కాప్రా చెరువు

మేడ్చల్: మంచినీటి సరస్సుగా ఉండే కాప్రా చెరువు ఇప్పుడు కలుషితమయంగా మారుతుంది. కాప్రా చెరువులోకి డ్రైనేజీ నీరు వచ్చి కలుస్తోందని, మరోవైపు రసాయనాల వ్యర్ధాలతో నీరు ఆకుపచ్చ రంగులో కనిపిస్తున్నట్లు అక్కడ ప్రజలు తెలియజేశారు. పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని, జలచరాలు బతికే పరిస్థితి లేదని చెబుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.