'PM-SGMBYను సద్వినియోగం చేసుకోవాలి'
PDPL: PM సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష పిలుపునిచ్చారు. సోమవారం పెద్దపల్లి కలెక్టరేట్‌లో ఈ పథకం ప్రచార రథాన్ని ఆయన ప్రారంభించారు. ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ బిల్లులు తగ్గుతాయని తెలిపారు. 3 కిలోవాట్ల సోలార్ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం రూ.78 వేల సబ్సిడీ అందిస్తుందని తెలిపారు.