VIDEO: గుంతలోకి దూసుకెళ్లిన కారు
NDL: సిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల సమీపంలో జాతీయ రహదారిపై ఇవాళ ఉదయం కారు అదుపుతప్పి గుంతలోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు వారు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.