జపాన్‌లో 'పుష్ప 2' రిలీజ్.. ఎప్పుడంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కిన మూవీ 'పుష్ప 2:ది రూల్'. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తాజాగా ఈ సినిమాను జపాన్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 'పుష్ప కున్రిన్' పేరుతో 2026 జనవరి 16న అక్కడ రిలీజ్ చేయనున్నట్లు తెలుపుతూ స్పెషల్ వీడియో షేర్ చేశారు. అక్కడ ఈ సినిమా ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో చూడాలి.