మోసపోయిన బాధితులకు అండగా సైబర్ పోలీసులు
HYD: సైబర్ క్రైమ్ పోలీసులు మోసపోయిన బాధితులకు అండగా నిలిచారు. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు 18 మంది సైబర్ నేరస్థులను అరెస్ట్ చేశారు. డీసీపీ సాయిశ్రీ తెలిపిన వివరాల ప్రకారం.. వారి నుంచి ఏకంగా రూ.63.23 లక్షల నగదును రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.