దారుణం.. బావిలో మహిళ మృతదేహం

AP: ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో దారుణం జరిగింది. బావిలో మహిళ మృతదేహం చూసి ఓ రైతు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతదేహాన్ని పోలీసులు జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.