కొడంగల్లో ఎడ్యుకేషన్ హబ్ ఉట్టి మాటేనా.?
VKB: విద్యా సంస్థల ఏర్పాటుతో కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్‌గా మారుతుందని భావించిన ప్రజలకు నిరాశే మిగులుతోందనే ప్రచారం సాగుతోంది. మెడికల్ కళాశాల, సమీకృత గురుకులాలు లగచర్లకు తరలింపు సరైంది కాదని, ఇక్కడే ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కొడంగల్ మండలంలోని అప్పాయిపల్లిలో మెడికల్ కాలేజీకి భూమిని సేకరించారు.