VIDEO: మచిలీపట్నంలో చెత్త సేకరణ వాహనం ప్రారంభం

కృష్ణా: మచిలీపట్నం నగరాన్ని చెత్త రహిత సుందర నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో, CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ మేరకు రూ.2.33 కోట్లతో కేంద్ర–రాష్ట్ర నిధులతో రెండు కంటైనర్ ట్రక్కులు కొనుగోలు చేశారు. బుధవారం కూటమి నాయకులు జెండా ఊపి ప్రారంభించారు. రోజుకు 80 టన్నుల చెత్త సమస్యను పరిష్కరించనున్నాయని కూటమి నాయకులు అన్నారు