VIDEO: ప్రజా పిర్యాదుల పరిష్కార వేదికకు 27 వినతులు
తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 27 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. 16 మంది కార్యాలయానికి నేరుగా వచ్చి వినతులు సమర్పించగా.. 11 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు.