చెరువు సప్లై పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
అన్నమయ్య: మదనపల్లె చీగలబైలు పంచాయతీలోని వెంకటమ్మ చెరువు సప్లై ఛానెల్ పనులను ఎమ్మెల్యే షాజహాన్, ఏఎంసీ ఛైర్మన్ జంగాల శివరామ్ మంగళవారం ప్రారంభించారు. భూగర్భ జలాల పెంపు, సాగునీటి లభ్యత ద్వారా రైతుల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. ఇరిగేషన్ అధికారులతో కలిసి నిర్వహించిన రైతు సమావేశంలో నీటి సంరక్షణపై అవగాహన కల్పించారు.