వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి
NDL: రుద్రవరం మండలంలోని కోటకొండ గ్రామంలో వడదెబ్బతో కుమ్మరి పెద్ద మద్దయ్య అనే ఉపాధి కూలీ ( 73) మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామ సమీపంలో ఉన్న పంట పొలాలలో ఉపాధి పని చేస్తూ ఉండగా ఎండ వేడిమి కారణంగా వాంతి చేసుకొని అస్వస్థకు గురయ్యారన్నారు. దీంతో అతన్ని తోటి ఉపాధి కూలీలు ఇంటికి తీసుకుని వస్తుండగా మార్గమధ్యలోని మృతి చెందినట్లు తెలిపారు.