పోలీసుల పేరు చెప్పి బంక్ మేనేజర్‌కు టోకరా..!

పోలీసుల పేరు చెప్పి బంక్ మేనేజర్‌కు టోకరా..!

MDCL: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పెట్రోల్ బంక్ మేనేజర్ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కారు. 'తాను సబ్ ఇన్స్పెక్టర్'నని చెప్పిన ఓ వ్యక్తి, కీసర సీఐకి నగదు కావాలంటూ మేనేజర్‌ను కోరాడు. వాట్స్ యాప్లో సీఐ ఫొటో చూసి నమ్మిన మేనేజర్, మోసగాడు పంపిన QR స్కానర్‌కు రూ.20 వేలు పంపాడు. డబ్బు తిరిగి రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.