నియోజకవర్గ సమస్యలపై సీఎంకు ఎమ్మెల్యే విజ్ఞప్తి
ATP: ఎమ్మెల్యే బండారు శ్రావణి మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి నియోజకవర్గ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. అరటి సాగు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, బుక్కరాయసముద్రంలో అంబేద్కర్ భవన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, అలాగే రోడ్డు నిర్మాణం, సీఎంఆర్‌ఎఫ్ కింద ఆర్థిక సహాయం వంటి అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.