బ్యాడ్మింటన్ పోటీలలో జగ్గయ్యపేట విద్యార్థుల ప్రతిభ

కృష్ణా: జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులను ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య అభినందించారు. జిల్లా స్థాయిలో పథకాలు సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారులు శుక్రవారం జగ్గయ్యపేటలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు తమకు నచ్చిన క్రీడలలో ప్రతిభ చూపుతూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.