అందుకు సాహితీవేత్తలు కృషి చేయాలి: వెంకయ్యనాయుడు
AP: తెలుగువారు ఏ ప్రాంతంలో ఉన్నా మాతృభాషలో మాట్లాడటాన్ని అలవాటు చేసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కడపలోని సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో డా.జానమద్ది హనుమచ్ఛాస్త్రి శతజయంతి ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సీపీ బ్రౌన్ గ్రంథాలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సాహితీవేత్తలు కృషి చేయాలని కోరారు.