కదిరి మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
సత్యసాయి: కదిరి పట్టణ మార్కెట్ యార్డ్‌లో నూతనంగా ఎన్నికైన ఛైర్మన్ అనసూయమ్మ, వైస్ ఛైర్మన్ కొమ్మినేని గంగయ్య నాయుడు, డైరెక్టర్‌లు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. రైతుల సంక్షేమం కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. పార్టీకి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.