ఖాదర్ దర్గాను మహోత్సవంలో ఎస్.కోట ఎమ్మెల్యే
VZM: సూఫీ భోదకుడు ఖాదర్ వలీ ఔలియా 67వ ఉరుసు మహోత్సవం విజయనగరంలోని బాబా మెట్ట ఖాదర్ దర్గాలోని దర్గా షరీఫ్‌లో శనివారం వైభవంగా నిర్వహించారు. ఉత్సవాలకు ముఖ్య అతిధిగా హాజరైన ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాం ప్రసాద్ బాబా ఆశీస్సులు అందుకొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సర్వమానవ సమత్వానికి నిలుస్తుందన్నారు.