‘వందేమాతరాన్ని 1937లోనే ముక్కలు చేశారు’
ప్రధాని మోదీ 'వందేమాతరం' గేయం గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వందేమాతరాన్ని 1937లోనే ముక్కలు చేశారని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. అసలైన గేయంలోని కొన్ని చాలా ముఖ్యమైన చరణాలను అప్పట్లోనే తొలగించారని పేర్కొన్నారు. ఆ చర్య దేశంలో విభజన భావజాలానికి బలమైన పునాది వేసిందని స్పష్టం చేశారు. అసలు ఆ చరణాలను ఎందుకు తొలగించాల్సి వచ్చింది? అని మోదీ ప్రశ్నించారు.