జిల్లా అభివృద్ధికి సీఎం ప్రత్యేక దృష్టి: ఎంపీ
WGL: ఉనికిచర్లలో ఎంపీ కడియం కావ్య పర్యటించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. వరంగల్ నగర అభివృద్ధికి సీఎం ప్రత్యేక దృష్టి సారించారని, ఇచ్చిన హామీ మేరకు నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఎయిర్ పోర్ట్, కోచ్ ఫ్యాక్టరీ, టెక్స్‌టైల్ పార్క్, స్పోర్ట్స్ స్కూల్స్, డ్రైనేజీ నిర్మాణం వంటి పనులకు రూ. 4 వేల కోట్లు మంజూరు చేశారని పేర్కొన్నారు.