'పిట్టలపాడులో ఎన్ఆర్ఎస్ టీసీ ఏర్పాటు చేయాలి'

ASR: కొయ్యూరు మండలం పిట్టలపాడు గ్రామంలో నాన్ రెషిడెన్సియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు మంగళవారం కోరారు. గ్రామంలో బడికి వెళ్లే పిల్లలు సుమారు 25 మంది ఉన్నారన్నారు. అయితే గ్రామంలో పాఠశాల లేక గరిమండ గ్రామ పాఠశాలకు వెళుతున్నారన్నారు. దీంతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే గ్రామంలో ఎన్ఆర్ఎస్ టీసీ ఏర్పాటు చేయాలని కోరారు.