రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా

KRNL: ఎమ్మిగనూరులోని అగ్రికల్చర్ కార్యాలయం ముందు ఇవాళ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా యూరియా అందక రైతులు ఇబ్బంది పడుతున్నారని పంపన్న గౌడ్ పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ డబ్బులు ఇప్పటికీ జమ కాలేదని వాపోయారు. రైతుల సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకొవాలని తెలిపారు.