బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద డైవర్షన్ ఏది?

బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద డైవర్షన్ ఏది?

GNTR: మంగళగిరిలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు వాహనదారులకు ఇబ్బందిగా మారాయి. బస్టాండ్, అంబేద్కర్ సెంటర్ వద్ద దారులు మూసివేశారు. దేవస్థానం రోడ్డు నుంచి వాహనాలు రాంగ్ రూట్‌లో వస్తుండటంతో ప్రమాదాల ముప్పు పొంచి ఉంది. దీని నివారణకు బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద డైవర్షన్ బోర్డులు ఏర్పాటు చేయాలని జనం కోరుతున్నారు. సిగ్నల్స్ వద్ద ఆటోల పార్కింగ్‌ లేకుండా చూడాలన్నారు.