బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం
బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. జాతీయ గీతం 'జనగణమన'ను బ్రిటిష్ అధికారికి స్వాగతం పలకడానికి రాశారని పేర్కొన్నారు. 'వందేమాతరం' గేయానికి ప్రాధాన్యం ఇవ్వాలని, జనగణమనతో సమానంగా పరిగణించాలని కోరారు. దీనిపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఘాటుగా స్పందించారు. ఇదంతా అట్టర్ నాన్సెన్స్, RSS వాట్సాప్ చరిత్ర పాఠమని విమర్శించారు.