'కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి'

NDL: జిల్లాలో రైతులను ఆదుకోవాలని వైసిపి నాయకులు సోమవారం నాడు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై నంద్యాల పట్టణంలో మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, రవిచంద్ర కిషోర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ విష్ణు కుమార్‌కు వైసీపీ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు.