సిద్ధయ్య మృతి బాధాకరం: ఎమ్మెల్యే పులివర్తి

TPT: ఏనుగు దాడిలో రైతు సిద్ధయ్య చనిపోవడం బాధాకరమని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచెర్లలలో సిద్దయ్య కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పులివర్తి నాని పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారాన్ని బాధిత కుటుంబానికి వీలైనంత త్వరగా అందిస్తామని తెలిపారు.