చేప పిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే

చేప పిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే

NZB: బాల్కొండ మండలం నాగపూర్ శివారులోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇవాళ చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్య సంపదను పెంచి, తద్వారా స్థానిక మత్స్యకారుల కుటుంబాలకు మెరుగైన జీవనోపాధి కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా మత్స్యకారుల సంఘం నాయకులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.