పంట పొలాలను పరిశీలించిన బోధన్ ఎమ్మెల్యే

NZB: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రెంజల్ మండలంలో ముంపుకు గురైన రైతుల పంట పొలాలను మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి సోమవారం పరిశీలించారు. నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. మండలంలో 5323 ఎకరాలలో సోయపంట, 4312 ఎకరాలలో వరి పంట నీట మునిగిందని అధికారులు అంచనాలు వేసి ఆయనకు నివేదికను అందించారు.