ఎమ్మెల్యేని పరామర్శించిన అదనపు కలెక్టర్
WGL: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి దొంతి కాంతమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి శుక్రవారం వారి నివాసానికి వెళ్లి కాంతమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియపరచారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.