సర్వభూపాల వాహనంపై వెంకయ్య స్వామి దర్శనం

NLR: వెంకటాచలం మండలంలోని గొలగమూడి శ్రీ వెంకయ్య ఆశ్రమం నందు వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం స్వామివారికి విశేష పూజలు తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామి వారు సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రసాదాలను స్వీకరించారు.