తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

AP: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 6 కంపార్టుమెంట్లలో శ్రీవారి దర్శనానికి భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తుల దర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 84,442 మంది భక్తులు దర్శించుకోగా.. 24,692 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.51 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.